బన్నీ ఫాన్స్ కి షాక్… సుకుమార్ తర్వాత బన్నీకి కూడా డెంగ్యూ, రష్మికనూ వదల్లేదు?

0
13

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

హ్యాట్రిక్ కాంబో

ఆర్య, ఆర్య – 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పుష్ప రాజ్ అనే ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ అలాగే కొన్ని గ్లిమ్స్ సినిమా మీద ఆసక్తిని భారీగా పెంచుతున్నాయి.

సుకుమార్ కు డెంగ్యూ

అయితే ఈ సినిమా షూటింగ్ నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. దానికి కారణం దర్శకుడు సుకుమార్ డెంగ్యూ బారిన పడటమే. ప్రస్తుతం సుకుమార్ వైద్యుల పర్యవేక్షణలో డెంగ్యూ జ్వరం నుంచి కోలుకుంటున్నారు. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా ప్రస్తుతానికి కాస్త యాక్టివ్గానే ఉన్నారని తెలుస్తోంది.

ఏకంగా 20 మంది

అయితే తాజాగా వెల్లడవుతున్న సమాచారం మేరకు సుకుమార్ మాత్రమే గాక పుష్ప యూనిట్ కి సంబంధించి దాదాపు 20 మంది డెంగ్యూ బారిన పడినట్లు తెలుస్తోంది. పుష్ప కథ ప్రకారం ఎక్కువ భాగం అడవుల్లోనే చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ స్పాట్ లో దోమలు ఎక్కువగా ఉండడంతో ఆ దోమలు కుట్టడం వల్ల ఇంత మంది ఒకేసారి డెంగ్యూ బారిన పడినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా

అయితే అర్జున్ ఫ్యాన్స్ అందరికీ షాక్ కలిగించేలాగా అల్లు అర్జున్ కూడా డెంగ్యూ బారిన పడ్డారని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ తో పాటు ఆయన పక్కన హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక కూడా డెంగ్యూ బారిన పడ్డారని తెలుస్తోంది అయితే కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే వీరిద్దరికి లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. వీరు కూడా ప్రస్తుతానికి డెంగ్యూ కు సంబంధించిన మెడికేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు.

అప్పుడే షూటింగ్

ఒక్కసారి అందరికీ ఆరోగ్యం కాస్త కుదుట పడగానే సినిమా షూటింగ్ మరలా మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాని ముందు ఒకే భాగంలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఈ సినిమా నిడివి భారీగా పెరుగుతుండటంతో రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసి ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు.

ఎలాంటి ఇబ్బంది లేదట

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫాజిల్, నటుడు సునీల్, అనసూయ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ డెంగ్యూ బారిన పడ్డారు అనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నన్నారు. అల్లు అర్జున్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here