బన్నీ డైరెక్టర్ తో యూత్ స్టార్..?

0
18

‘రంగ్ దే’ సినిమాతో సక్సెస్ అందుకున్న యూత్ స్టార్ నితిన్.. ప్రస్తుతం ‘మాస్ట్రో’ అనే మూవీ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు నిర్మిస్తున్నారు. దీని తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ”పవర్ పేట” అనే సినిమా కమిట్ అయ్యాడు. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ నితిన్ కు ఓ స్టోరీ వినిపించడాని తెలుస్తోంది.

వక్కంతం వంశీ ‘అశోక్’ ‘అతిథి’ ‘ఊసరవెల్లి’ ‘రేసుగుర్రం’ ‘కిక్’ ‘టెంపర్’ ‘ఎవడు’ వంటి చిత్రాలకు రచయితగా వర్క్ చేసాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ.. తొలి ప్రయత్నంలోనే ప్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత మరో సినిమాని డైరెక్ట్ చేయనప్పటికీ.. వేరే దర్శకులకు కథలు అందిస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్న రెండు సినిమాలకు వంశీ రచయితగా పనిచేస్తున్నారు. ఇప్పటికే అఖిల్ అక్కినేనితో చేయబోయే సినిమాకి కథ సిద్ధంగా ఉండగా.. పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో వంశీ ఇప్పుడు నితిన్ కోసం అధ్బుతమైన కథను రెడీ చేసారట.

ఇప్పటికే నితిన్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చిందని.. హోమ్ బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా సురేందర్ రెడ్డితో కూడా నితిన్ ఓ సినిమా చేస్తాడని టాక్ నడుస్తోంది. మరి వక్కంతం వంశీ రెడీ చేసిన స్టోరీ నితిన్ ని డైరెక్ట్ చేయడానికి లేదా సూరి – నితిన్ కాంబోలో సినిమా కోసమా అనేది చూడాలి. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here