‘బంగార్రాజు’ మనవడు అఖిల్?

0
28

నాగార్జున కలల ప్రాజెక్ట్ బంగార్రాజుని జులై నుండి పట్టాలెక్కించబోతున్న సంగతి తెలిసిందే. నాగ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. నిజానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ననాయనతో హిట్ కొట్టడంతో అదే కళ్యాణ్ కృష్ణ తోనే నాగ్ బంగార్రాజు ప్రాజెక్ట్ చెయ్యాలని నిర్ణయించుకుని  ఏళ్ళు గడుస్తున్నా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్క లేదు. స్క్రిప్టు సరిగ్గా రాలేదని చాలా వెర్షన్స్ మార్చి మార్చి రాస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే మొత్తానికి నాగ్ ఓ చోట లాక్ అయ్యారట. దాంతో  ఆ ప్రాజెక్ట్ గురించి నాగార్జున అఫీషియల్ గా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందంటూ వార్తలు మొదలు అయ్యాయి. మీడియాలోని కొందరు కథకులు కథలు అల్లేస్తున్నారు.

ఈ నేపధ్యంలో  బంగార్రాజు స్టోరీ ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాళ్లు చెప్పేదాని ప్రకారం సోగ్గాడే చిన్నినాయనలో తండ్రి కొడుకుగా నాగ్  డ్యూయెల్ రోల్ చేస్తే..ఇక్కడ  బంగార్రాజు లో కొద్ది మార్పులు చేసారట.  నాగార్జున కొడుకుగా నాగ చైతన్య కనిపిస్తారట. అంతవరకూ బాగానే ఉంది. అయితే నాగచైతన్య  కొడుకుగా అఖిల్ కనిపిస్తారని చెప్తున్నారు. అయితే సినిమా చివర్లో అఖిల్ అలా మెరుస్తారంటున్నారు. కథలో అఖిల్ కు ఏమీ ప్రాధాన్యత ఉండదని చెప్తున్నారు.

 ఫస్టాఫ్ లో బంగార్రాజు పాత్ర ఇంటర్వెల్ అయ్యాక…నాగచైతన్య ఇండ్రడక్షన్..సెకండాఫ్ వీళ్లద్దరి మధ్యా సీన్స్ ఉంటాయిట. దాంతో నాగచైతన్య పాత్రని రమ్య కృష్ణ అమాయికంగా పెంచటం వంటివి చూపెడతారట.. అయితే అఖిల్  రోల్ చాలా తక్కువ అంటే జస్ట్ గెస్ట్ రోల్ లా ఉండబోతుందన్నమాట. ఇక బంగార్రాజు లో అదే ట్విస్ట్ అంటూ ప్రచారం మొదలయ్యింది. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇక టుబి ఫ్రాంక్ చెప్పాలంటే నాగార్జున కి ఈమధ్యన పెద్దగా ఏదీ కలిసి రావడం లేదు.. వరస డిజాస్టర్స్ తో మార్కెట్ పరంగా డల్ అయ్యాడు.  ఎంతో ఆశలు పెట్టుకున్న వైల్డ్ డాగ్ నాగార్జునకి కి కలిసిరాలేదు. ఓటీటిలో హంగామా చేసింది కానీ థియోటర్స్ లో దేకింది లేదు. థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఓటిటిలో సూపర్ హిట్  అయ్యింది. ఇక ప్రవీణ్ సత్తారుతో నాగార్జున తన నెక్స్ట్ మూవీ చేస్తున్నా కరోనా కారణముగా ఆ మూవీ షూటింగ్ ఆగిపోయింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here