బంగార్రాజు పై ఇంకెన్ని పుకార్లు వినాలో..!

0
40

అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే బంగార్రాజు పాత్ర తో సినిమా ను తెరకెక్కించాలని నాగార్జున భావించాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో బంగార్రాజు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యిందని కూడా వార్తలు వచ్చాయి. దాదాపు అయిదు సంవత్సరాలుగా బంగార్రాజు సినిమా గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో సార్లు సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఏదో కారణం వల్ల సినిమా ను వాయిదా వేస్తూ వస్తున్నారు.

బంగార్రాజు సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యిందంటూ ప్రచారం జరిగింది. కాని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా బంగార్రాజు సినిమా కథ చర్చల దశలోనే ఉందట. ఈ సమయంలోనే కొత్తగా మరో ప్రచారం మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది. బంగార్రాజులో కీలక పాత్రను రమ్యకృష్ణ చేస్తుందంటూ ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హాను బంగార్రాజు సినిమా లో నటింపజేసేందుకు చర్చలు జరిగాయి అంటున్నారు. ఇటీవలే కథ ను సోనాక్షి సిన్హాకు వినిపించారు అనేది కొత్త పుకారు.

నాగార్జున అయిదు సంవత్సరాలుగా వాయిదా వేస్తూ వస్తున్న బంగార్రాజు సినిమా అదిగో మొదలు.. ఇదిగో మొదలు అంటూ వార్తలు వచ్చాయి కాని ఇప్పటి వరకు మొదలు అయ్యింది లేదు. ఈ సినిమా గురించి ముందు ముందు మరెన్ని పుకార్లు వినాల్సి వస్తుందో అంటూ అక్కినేని అభిమానులు పెదవి విరుస్తున్నారు. బంగ్రాజు సినిమా ను నాగార్జునకు చేయాలని ఉంది అనేది మాత్రం వాస్తవం. కాని అది ఎప్పుడు మొదలు అయ్యేది మాత్రం క్లారిటీ లేదు. ఈలోపు కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here