‘బంగార్రాజు’లో చైతూ జోడిగా సమంత?

0
15

అందం .. అభినయం కలిసి తమకి మంచి పేరు ఏదైనా ఉంటే బాగుంటుందని భావించి బాగా ఆలోచించి పెట్టుకున్న పేరే సమంత. తెలుగు .. తమిళ భాషల్లో సమంత చాలా తక్కువ సమయంలో స్టార్ డమ్ ను అందుకుంది. ఈ రెండు భాషల్లో స్టార్ హీరోలందరినీ చుట్టబెట్టేసింది. అలాంటి సమంత .. వివాహానికి ముందు వరకూ తన జోరును చూపిస్తూ వచ్చింది. ‘రంగస్థలం’ సినిమా తరువాత చైతూ జోడీగా చేసిన ‘మజిలీ’ని పక్కన పెడితే యూ టర్న్ .. ఓబేబీ .. జాను వంటి నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళ్లింది. ఒక్క ‘జాను’ మినహా మిగతా సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి.

అలాంటి సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా చేస్తోంది. కరోనా ఉద్ధృతి తగ్గిన తరువాత ఆమె సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ‘బంగార్రాజు’ సినిమాకి సంబంధించి కూడా ఆమె పేరు వినిపిస్తోంది. నాగార్జున కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక వీరి కొడుకు పాత్రలో నాగచైతన్య నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.

నాగచైతన్య భార్య పాత్రలో సమంత కనిపించనుందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. వీరి తనయుడిగా అఖిల్ నటించనున్నాడు. అంటే ఒక రకంగా నాగ్ ఫ్యామిలీ దాదాపు కవర్ అవుతుందన్న మాట. ఫ్యామిలీ సినిమా కావడం .. చైతూ భార్య పాత్ర కావడం వలన సమంత ఓకే చెప్పిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here