ప్రభాస్ కు కథ వినిపించిన లేడీ డైరెక్టర్

0
28

తెలుగు దర్శకురాలు సుధ కొంగర తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. సుదీర్ఘ కాలంగా దిగ్గజ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సుధా కొంగర ఇప్పటికే తమిళంలో పలు విభిన్న చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తమిళ స్టార్ హీరో సూర్యతో ఈమె తెరకెక్కించిన సూరారై పోట్రు సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా పలు అవార్డులకు సైతం నామినేట్ అయ్యింది. తెలుగు లో ఆకాశమే నీ హద్దు గా ఆ సినిమా డబ్బింగ్ అయ్యి ఆకట్టుకుంది. థియేటర్లు ఓపెన్ లేక పోవడంతో ఆ సమయంలో ఓటీటీ లో విడుదల అయ్యింది. థియేటర్ విడుదల అయ్యి ఉంటే 100 కోట్ల సినిమా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతటి సూపర్ హిట్ ను దక్కించుకున్న సుధా కొంగర తదుపరి సినిమా ఎవరితో అంటూ గత కొన్నాళ్లుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుధా పలువురు స్టార్స్ తో చర్చలు జరుపుతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

కొన్నాళ్ల క్రితం మహేష్ బాబుతో సుధా కొంగర మూవీ అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో సుధాకొంగర మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా సుధా కొంగర ఏకంగా ప్రభాస్ కు కథ వినిపించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభాస్ కోసం ఒక విభిన్నమైన స్టోరీ లైన్ ను సుధా రెడీ చేసిందట. ఆ స్టోరీ లైన్ ను సుధా వినిపించారని తెలుస్తోంది. స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయాల్సిందిగా సుధా కు ప్రభాస్ చెప్పాడని కూడా అంటున్నారు. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ తో సినిమా చేయాలంటే ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ అన్నింటిని ఆయన పూర్తి అయిన తర్వాతే చేయాల్సి ఉంటుంది. అంటే కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. 2023 వరకు ప్రభాస్ వరుసగా కమిట్ అయిన సినిమాలతో బిజీ బిజీగా ఉంటాడు. రాధే శ్యామ్.. సలార్.. ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలతో పాటు బాలీవుడ్ లో మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా కు కమిట్ అయ్యాడట. ఇవన్ని పూర్తి అయ్యి సుధా కొంగర తో ప్రభాస్ సినిమా ఉంటుందేమో అంటున్నారు. కాని ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయగల సత్తా సుధా కొంగరకు లేదంటున్నారు. సుధా కొంగరతో ప్రభాస్ సినిమా చేయడం వారికి ఇష్టం లేదు. మరి ప్రభాస్ నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here