‘పుష్ప 2’ లో అదే హైలైట్

0
22

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంంలో రూపొందుతున్న పుష్ప సినిమా లో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. పుష్ప సినిమా ను రెండు పార్ట్ లు గా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా రెండు పార్ట్ ల్లో కూడా ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలైట్ గా ఉంటుందట.

మొదటి పార్ట్ తో పోల్చితే రెండవ పార్ట్ లో ఫహద్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడట. ఇప్పటి వరకు ఫహద్ చేసిన పాత్రల కంటే చాలా విభిన్నంగా ఈ సినిమాలో పాత్ర ఉంటుందని ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం పుష్ప సినిమా రెండవ పార్ట్ కు సంబంధించి ఇటీవల వినిపిస్తున్న వార్తలు బన్నీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

కేజీఎఫ్ సినిమా రెండు పార్ట్ ల్లో ఎలా అయితే ప్రేక్షకుల ముందుకు వస్తుందో అదే తరహాలో పుష్ప సినిమా ను విడుదల చేస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. కీలక పాత్రలో అనసూయ కనిపించబోతున్న విషయం తెల్సిందే. చిత్రం లోని కీలక సన్నివేశాలను అటవి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు. సినిమా రెండు పార్ట్ ల విడుదలకు సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here