‘పుష్ప’ నిర్ణయం పట్ల బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా లేరా..?

0
25

అల్లు అర్జున్ – రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ”పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై బన్నీ – సుక్కూ మధ్య చర్చలు జరిగాయని.. చివరకు 2 పార్ట్స్ గా చేయాలని డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది.

అయితే ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా లేరని తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని కొందరు అభిమానులు సమర్ధిస్తుండగా.. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం తప్పుబడుతున్నారు. ముందు నుంచి ప్లాన్ చేసుకోకుండా ఇప్పుడు కంటెంట్ ని 2 భాగాలుగా చేయడం అనేది సరైనది కాదని.. బన్నీ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డిస్కష్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
 
ఇకపోతే ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తుండటంతో ఇందులో అల్లు అర్జున్ ది ద్విపాత్రాభినయం కూడా అయ్యిండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ ని దసరాకు లేదా డిసెంబర్ నెలలో.. అలానే రెండో భాగాన్ని వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here