పాన్ ఇండియాకి బీచ్ సాంగ్ సెంటిమెంట్

0
23

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో బీచ్ సాంగ్ కి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్ -పటాయా-గోవా- మారిషస్ లాంటి దీవుల్లో ఆయన ఒక బీచ్ సాంగ్ తప్పనిసరిగా ప్లాన్ చేస్తుంటారు.

బేసిగ్గా ఆయన కథలన్నీ బీచ్ లో పుడతాయి కాబట్టి  బీచ్ సాంగ్ మస్ట్. బికినీ బీచ్ లో ఒక సాంగ్ అయినా ఉండాలనేది అతడి రూల్. ఇప్పటి వరకూ పూరి డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలోనూ హాట్ రొమాంటిక్  బీచ్ సాంగ్స్ హీటెక్కించాయి. `శివమణి`.. `సూపర్`..  `దేశముదురు`.. చిరుత`.. `గోలీమార్`.. `పోకిరి`.. `బిజినెస్ మ్యాన్`.. `టెంపర్`..  `హార్ట్ ఎటాక్`..` లోఫర్`.. `ఇస్మార్ట్ శంకర్` ఇలా దాదాపు అన్ని సినిమాలను బీచ్ పాటలతో మెస్మరైజ్ చేసిన ఘనత పూరికి దక్కుతుంది. బీచ్ సాంగ్స్ ఓ సక్సెస్  మంత్రగాను పనిచేశాయి. అందుకే మరోసారి అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారట.

విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `లైగర్` కి ఈ సెంటిమెంట్ వర్తింపజేస్తున్నారట. ఇందులో మంచి  ఊపున్న హాట్ బీచ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పట్టుబట్టి మరీ విజయ్ ని ఒప్పించాడట పూరి. ప్రస్తుత కరోనా వేవ్ అదుపులోకి రాగానే  మారిషస్ లేదా మాల్దీవుల్లో ఈ పాట చిత్రీకరించాలన్నది ప్లాన్.

బీచ్ సాంగ్ రౌడీకి తొలి అనుభవం అవుతుంది. ఒక రకంగా రిలాక్స్ ట్రీట్ అనుకోవచ్చు. పూరి మార్క్ క్రియేటివిటీ…రౌడీ స్టార్ క్రేజ్ కలిస్తే ఈ బీచ్ సాంగ్ ఓ రేంజ్ లో వర్కవుటవుతుందనే అంచనా. హీరోయిన్ అందాల ఎలివేషన్ ఇలాంటి పాటలో పీక్స్ లోనే ఉంటుంది. `లైగర్` కి బీచ్ సాంగ్ సెంటిమెంట్ ఏమేరకు వర్కవుటవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here