నితిన్ జోడీగా ‘ఉప్పెన’ పిల్ల

0
23

ప్రేమకథల ద్వారా చాలామంది కథానాయికలు పరిచయమయ్యారు .. వెళ్లారు. కానీ ‘ఉప్పెన’ సినిమాలో లాంటి పిల్లను మాత్రం తాము చూడలేదనే మాట చాలామంది అన్నారు. తెరపై తేనె పుష్పంలా విరిసిన ఈ అమ్మాయిని చూసి తమ మనసులపై అన్ని హక్కులను రాసిచ్చేసిన అబ్బాయిలు చాలామందినే ఉన్నారు. సొట్టబుగ్గలతో కూడిన నవ్వులతో ఈ పిల్ల గారడీ చేస్తోందనీ .. గుండెలన్నీ గల్లంతు చేస్తోందని పిల్లగాళ్లంతా ఫిర్యాదు చేస్తున్నారు. ‘ఉప్పెన’ వచ్చిపోయాక దాని బారిన పడ్డవాళ్లు కొన్ని రోజులకు కోలుకుంటారు. కానీ ఈ పిల్లను తెరపై చూసినవాళ్లు మాత్రం ఇంతవరకూ కోలుకోలేదు.

ఉప్పెన’ సినిమా కథాకథనాలు ఎలా ఉన్నాయి? చిత్రీకరణ ఎలా ఉంది? వంటి విషయాలన్నీ థియేటర్ కి వచ్చిన తరువాత సంగతి. కానీ జాతరలా జనాన్ని థియేటర్ల దిశగా నడిపించింది మాత్రం ఈ అమ్మాయినే. అందువల్లనే ఈ అమ్మాయిని తమ సినిమాల్లో కథానాయికగా తీసుకోవడానికి దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ అమ్మాయి నాని .. సుధీర్ బాబు .. రామ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానున్నాయి.

‘ఉప్పెన’ సినిమా వేదికపై చిరంజీవి చెప్పినట్టు ప్రస్తుతం ఈ అమ్మాయి డేట్లు దొరికే పరిస్థితి లేదు. అయినా యువతరం స్టార్ హీరోలు తమ ప్రయత్నాలు ఆపడం లేదని తెలుస్తోంది. ‘అంధదూన్’ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో  నితిన్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్టుగా టాక్. ఇక నిఖిల్ .. నాగశౌర్య .. చైతూ .. తదుపరి సినిమాలలో  హీరోయిన్ గా కూడా ఈ అమ్మాయినే అడుగుతున్నారట. అయితే వీరందరికంటే ముందుగా తమిళ హీరో శివకార్తికేయన్ .. మలయాళ స్టార్ దుల్కర్ సినిమాలు లైన్లో ఉండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి ‘ఉప్పెన’ పిల్ల అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోందే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here