నాయికగా నయతార…! త్రిష…?

0
17

ఒక కథ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఆ కథలో ఏయే అంశాలు ఏ పాళ్లలో ఉండాలనేది త్రివిక్రమ్ కి బాగా తెలుసు. ఎంటర్టైన్ మెంట్ కి సంబంధించిన ఏ చిన్న సన్నివేశాన్ని ఆయన వదులుకోడు. అందువలన ఆయన సినిమాలు ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తుంటాయి .. టీవీల్లో ఎన్నిమార్లు ప్రసారమైనా చూడాలనిపిస్తూనే ఉంటాయి. అలాంటి త్రివిక్రమ్ .. వెంకటేశ్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు మళ్లీ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

వెంకటేశ్ కెరియర్లో సూపర్ హిట్లుగా నిలిచిన ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. దర్శకుడిగా మాత్రం ఆయన ఇంతవరకూ వెంకటేశ్ తో చేయలేదు. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు ఉందనే టాక్ మాత్రం జోరుగానే వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార పేరు .. త్రిష పేరు వినిపిస్తున్నాయి. వెంకీతో నయన్ చేసిన ‘లక్ష్మీ’ .. ‘తులసి’ సినిమాలు హిట్ అయితే ఆయనతో త్రిష చేసిన ‘నమో వెంకటేశ’ .. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ విజయాలను అందుకున్నాయి.

వెంకటేశ్ సరసన నాయికలుగా ఈ ఇద్దరిలో ఎవరైనా బాగుంటారు .. అయితే ఎవరిని తీసుకుంటారు? అనేదే ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి త్రిష దూరంగా ఉంటూ వస్తుంది కనుక నయనతారను తీసుకునే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘బాబు బంగారం’ షూటింగు ఆలస్యం కావడానికి నయనతార కారణమనే టాక్ అప్పట్లో వచ్చింది. అలా చూసుకుంటే త్రిషకి ఛాన్స్ దక్కుతుంది. మరి ఈ ఇద్దరూ కాకుండా త్రివిక్రమ్ మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలియదు. మహేశ్ బాబుతో సినిమా తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here