దేవరకొండ సరసన కత్రిన.. బాలీవుడ్ లో రెండో సినిమా!

0
34

రౌడీ విజయ్ దేవరకొండ `లైగర్` చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అతడు నటించే రెండో సినిమా గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది.దేవరకొండ సరసన అందాల కత్రిన కైఫ్ నటించనుంది. ఆ సినిమాకి ఇప్పటికే దేవరకొండ సంతకం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది.

ఇటీవల కత్రిన ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ ను అనుసరించడం ప్రారంభించాక అభిమానుల్లో మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. ఈ చిత్రంలో నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దేవరకొండ ఇంకా బాలీవుడ్ లో ప్రవేశించనే లేదు. కానీ అతడికి బాలీవుడ్ నాయికలు అభిమానులుగా మారారు. దేశవ్యాప్తంగా దేవరకొండకు వీరాభిమానులున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న దక్షిణ భారత నటుడిగా పాపులరయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here