త్రివిక్రమ్ నెక్ట్స్ ఆ ల్యాండ్ మార్క్ ఫిల్మ్?

0
31

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కటానికి అంతా సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రకటన కూడా వచ్చేసింది. ఒక్కసారి కరోనా పరిస్దితులు చక్కబడ్డాక ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. వచ్చే సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఏ హీరో తో సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ తో సినిమా అంటున్నారు. అది జరుగుతుందా అనేది ఇప్పుడు సినీ ప్రియుల మైండ్ లో పెద్ద క్వచ్చిన్. అయితే అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ తను కమిటైన ప్రాజెక్టులు ఫినిష్ చేసుకుని త్రివిక్రమ్ దగ్గరకు వచ్చేటప్పటికి టైమ్ పడుతుంది. ఈ లోగా త్రివిక్రమ్ మరో సినిమా చేసేస్తారు. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో చేయబోతున్నారు. అది వెంకటేష్ కు ల్యాండ్ మార్క్ ఫిల్మ్. 75 వ సినిమా కావటంతో ఖచ్చితంగా త్రివిక్రమ్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయమై వెంకటేష్ త్రివిక్రమ్ మధ్య డిస్కషన్స్ ఇప్పటికే నడిచాయంటున్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్ సినిమా కోసం ప్రయత్నాలు చాలా ఏళ్ళగా జరుగుతున్నాయి. కానీ ఏదీ మెటిరియలైజ్ కాలేదు.

గతంలో వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ‘మల్లీశ్వరి’ సినిమాలకి త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు. ఈ రెండు సినిమాలు హై సక్సెస్ అవ్వటమే కాదు వెంకీ కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ లుగా మిగిలాయి. ఇక ఇప్పుడు మరో సారి త్రివిక్రమ్ వెంకటేష్ ను డైరెక్ట్ చేయబోతున్నారంటే ఖచ్చితంగా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి.  

వెంకటేష్  ఈ మధ్యకాలంలో ఫాస్ట్గా సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. ఓ సినిమా పూర్తి అయ్యిన వెంటనే కొత్త సినిమాలను మొదలుపెడుతుంటాడు.  వెంకటేష్ …ఓ పక్క నారప్ప ఎఫ్3 షూట్ లో పాల్గొంటూనే.. మరో పక్క దృశ్యం2 సినిమాని పట్టాలెక్కించాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here