తమిళ పవర్ స్టార్ తెలుగు డెబ్యూకి అన్ని కోట్లు ఇస్తున్నారా..?

0
26

తమిళ పవర్ స్టార్ విజయ్ త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ నిజమే అని ఇప్పుడు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే వంశీ చెప్పిన కథకు హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా రూపొందనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. అయితే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడం కోసం విజయ్ కు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ అక్కడ తన రేంజ్ కి తగ్గట్టే భారీ పారితోషకం తీసుకుంటారు. ఒక్కో సినిమాకి ఆయన 75 – 80 కోట్లు తీసుకుంటారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు దిల్ రాజు దీనికి అదనంగా విజయ్ కు మరో 10 కోట్లు ఆఫర్ చేసాడని.. ఈ ప్రాజెక్ట్ కు విజయ్ దాదాపు 85 – 90 కోట్లు అందుకోనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా 150 కోట్లకు పైగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా బిజినెస్ ఏ స్థాయిలో ఉండాలనే దాని గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

‘ఊపిరి’ ‘మహర్షి’ వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. ఇటీవల ‘మహర్షి’ చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో వంశీ నెక్స్ట్ సినిమా ఏంటనే ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో వంశీ డైరెక్షన్ లో విజయ్ హీరోగా భారీ సినిమా సెట్ చేశాడు దిలరాజు. ఈ మధ్య పెద్ద సినిమాలన్నింటిని వేరే నిర్మాణ సంస్థలతో కలసి నిర్మిస్తున్న దిల్ రాజు.. శంకర్ – చరణ్ ప్రాజెక్ట్ చేంజ్ సోలోగా చేస్తున్నారు. అయితే విజయ్ తో చేసే భారీ బడ్జెట్ సినిమాని ఓ తమిళ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి నిర్మిస్తారని టాక్. అందుకే హీరోకి అంత పారితోషకం ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. అలానే ఇది పాన్ ఇండియా లేదా పాన్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమాపై క్లారిటీ రావాలంటే అఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here