‘డ్రైవింగ్ లైసెన్స్’ చివరికి ఎవరికిస్తారో..!

0
42

మలయాళంలో సూపర్ హిట్ అయిన ”డ్రైవింగ్ లైసెన్స్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అనుకోని పరిస్థితుల వల్ల విరోధులుగా మారిన హీరో మరియు అతన్ని అభిమానించే ఓ ఆర్టీఏ ఆఫీసర్ మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పృథ్వీరాజ్ మరియు సూరజ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాని ఇష్టపడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నట్లు టాక్ వచ్చింది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ కలిసి ఈ మల్టీస్టారర్ చేస్తారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత రవితేజ – విజయ్ సేతుపతి లతో ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాని తెలుగు తమిళ భాషల్లో తీయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా విక్టరీ వెంకటేష్ తో ఈ రీమేక్ చర్చలు జరుపుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వెంకీ ని పృథ్వీరాజ్ పోషించిన హీరో పాత్ర కోసం అడుగుతున్నారా లేదా ఆర్టీఏ అధికారి రోల్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలో ఉందని తెలుస్తోంది. మరి చివరకు ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఎవరి చేతిలోకి వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here