డిటెక్టివ్ గా నాని..?

0
21

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ”శ్యామ్ సింగ రాయ్”. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి – కృతి శెట్టి – మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఇందులో నాని డిక్టెటివ్ పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదో కామెడీ అండ్ థ్రిల్లింగ్ డిటెక్టివ్ స్టోరీ అని.. ‘షెర్ లాక్ హోమ్స్’ – సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’ సినిమాల తరహాలో ఉంటుందని అంటున్నారు.

అలానే ఇందులో సాయిపల్లవి మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ నానికి లవ్ ఎట్రాక్షన్ మాత్రం కృతి శెట్టి అని టాక్. ఇకపోతే ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ ఎక్కువ భాగం కలకత్తాలో జరిగింది. దీని కోసం హైదరాబాద్ పరిసరాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారు. ఇది నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పవచ్చు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం.

‘శ్యామ్ సింగ్ రాయ్’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన నాని – సాయి పల్లవి ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో జిషు సేన్ గుప్తా – రాహుల్ రవీంద్రన్ – మురళీ శర్మ – అభినవ్ గోమటం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జంగా సత్యదేవ్ ఈ చిత్రానికి స్టోరీ అందించగా.. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here