టాప్ ప్రొడ్యూసర్కు Pooja Hegde షాక్.. నితిన్, నిర్మాత ఆశలపై నీళ్లు!

0
9

టాలీవుడ్‌లో వివాదాలకు దూరంగా ఉండే స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్గే తాజాగా ఓ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఓ స్టార్ ప్రొడ్యూసర్, యువ హీరో నితిన్ సినిమాకు సంబంధించిన వ్యవహారం వివాదంగా మారింది. తాను నిర్మించే చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారనే విషయం మీడియాలో సదరు నిర్మాత ప్రచారం చేసుకోవడంతో పూజా హెగ్డే టీమ్ ఘాటుగా స్పందించినట్టు తెలిసింది.

నిర్మాత లీక్‌తో మీడియాలో రచ్చ

టాలీవుడ్ మీడియాలో కథనాల ప్రకారం.. యువ హీరో నితిన్‌తో ఓ మంచి కథతో సినిమాను నిర్మించేందుకు టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత ప్లాన్ చేశారు. అయితే పూజా హెగ్డే హీరోయిన్ అయితే బాగుండని భావించారు. కానీ ఆమె టీమ్‌తో సంప్రదింపులు చేయకుండానే.. పూజా హెగ్డే నటిస్తున్నారనే విషయాన్ని సదరు నిర్మాత మీడియాకు లీక్ చేశారు. దాంతో నితిన్‌తో పూజా హెగ్డే నటిస్తున్నారనే విషయం వైరల్ అయింది.

పబ్లిసిటీపై పూజా హెగ్డే టీమ్ గరం

తమతో సంప్రదించకుండా, అంగీకారం, ఆమోదం లేకుండా మీడియాలో పబ్లిసిటీ ఇవ్వడంపై పూజా హెగ్డే టీమ్ గరం అయింది. మేము ఎలాంటి హామీ ఇవ్వకుండానే మీడియాలో ఎలా ప్రచారం చేసుకొంటారు. ఇది సరికాదు. పూజా హెగ్డే ప్రస్తుతం విజయ్‌తోను, రాంచరణ్‌తోను, ప్రభాస్‌తో నటిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించి ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. నితిన్‌తో పూజా హెగ్డే ఎలా చేస్తారు అనేంతంగా వారి మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నితిన్‌తో సినిమా చేయడం లేదంటూ

ఇక ముందు పూజా హెగ్డే విషయంలో అధికారికంగా ఒప్పందం జరగకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం తగదు. ఏదైనా మీడియాకు చెప్పే ముందు తమ అనుమతి తీసుకోవాలి అని సదరు నిర్మాతకు టీమ్ సూచించినట్టు తెలిసింది. అధికారికంగా చర్చలు, అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాతే మీడియాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అనే అభిప్రాయానికి పూజా హెగ్గే టీమ్ వచ్చింది అని తెలుస్తున్నది. అంతేకాకుండా నితిన్ సినిమాలో చేయడం లేదంటూ మీడియాకు సమాచారం కూడా ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

పూజా హెగ్డే క్లారిటీతో కథ అడ్డం తిరిగి…

నితిన్‌తో పూజా హెగ్డే నటిస్తున్నారనే విషయం మీడియాలో వస్తే… తప్పకుండా చేస్తారనే విషయంతో సదరు నిర్మాత ప్లాన్ వేశారని.. అది కాస్తా అడ్డం తిరగడంతో ఇబ్బందుల్లో పడ్డానరే విషయం మీడియాలో చర్చ జరుగుతున్నది. అయితే సదరు నిర్మాత 3 కోట్లకుపైగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పూజా హెగ్డే చేయడానికి విముఖత చూపించినట్టు తెలుస్తున్నది.

బీస్ట్ పాటను పూర్తి చేసుకొన్న పూజాహెగ్డే

కాగా, ఇటీవలే పూజా హెగ్డే తమిళ ఇళయదళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ చిత్ర షూటింగులో పాల్గొన్నారు. జూలై 1న చెన్నైకి వెళ్లిన ఈ బ్యూటీ జూన్ 9న సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకొన్నారు. మరికొద్ది రోజుల్లో వడపళనిలో ప్రారంభమయ్యే మరో షెడ్యూల్‌కు పూజా హెగ్డే సిద్దమవుతున్నారు. ఈ లోపు ఆచార్య, ఇతర సినిమాల షూటింగుకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకొంటున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here