జోనస్ కన్నా ముందు.. ప్రియాంక పెళ్లాడాలనుకున్నది ఇతన్నే!

0
20

 ‘ప్రియాంక చోప్రా..’’ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ మాత్రమే కాదు. హాలీవుడ్ స్టార్. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తర్వాత ఇండియా నుంచి షిఫ్ట్ అయిపోయిన బ్యూటీ.. ఇప్పుడు ప్రపంచ తారగా వెలిగిపోతోంది. అయితే.. జోనస్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రియాంక మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుందట. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

ఇండియన్ స్క్రీన్ పై వెలిగిపోతున్న సమయంలోనే ప్రియాంకపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే.. వాటన్నింటికీ సైలెంట్ గానే చెక్ పెట్టిందీ బ్యూటీ. అయితే.. ఎవ్వరూ ఊహించని విధంగా.. నిక్ జోనస్ చేయి పట్టుకుందీ అమ్మడు. ఈ విషయం ఎంతో మందిని షాక్ కు గురిచేసింది. ఇప్పుడు వీళ్లిద్దరూ ఎంతో హ్యాపీగా సంసారం చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు చర్చలోకి ఎలా వచ్చిందోగానీ.. జోనస్ కన్నా ముందు ప్రియాంక పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఇతనే అంటూ తెరపైకి వచ్చింది. దీంతో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతను ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి అతగాడు ఎవరు అంటే.. హిందీ టీవీ నటుడు మోహిత్ రైనా.

ప్రియాంక వాళ్ల ఆంటీ.. ఈ సంబంధం చూసిందట. మోహిత్ రైనా ప్రియాంకకు మంచి జోడీ అవుతాడని భావించిందట. ఇదే విషయాన్ని ప్రియాంక పేరెంట్స్ కూడా చెప్పిందట. అయితే.. అప్పటికే ప్రియాంక బాలీవుడ్లో పెద్ద స్టార్. మోహిత్ ను చూస్తే టీవీ రంగంలో చిన్న నటుడు. అందువల్ల ఆమె పేరెంట్స్ అంగీకరించలేదట. దీంతో.. మోహిత్ ప్లేస్ ను భర్తీ చేశాడు జోనస్. అదన్నమాట సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here