జాతిరత్నాలు డైరెక్టర్ ఇలా షాక్ ఇచ్చాడేంటి.. తమిళ్ హీరోతో మంతనాలు?

0
10

ఈ రోజుల్లో దర్శకులు చాలా స్పీడ్ గా ఉన్నారు. ఒకప్పుడు స్టార్ దర్శకులు సినిమా సినిమాకు కొంత గ్యాప్ తీసుకునేవారు. కానీ కరోనా వలన గ్యాప్ ఎక్కువగా రావడంతో మళ్ళీ హీరోల డేట్స్ దొరకవేమో అని ముందే సెట్ చేసుకుంటున్నారు. ఇక యువ దర్శకులు కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నారు. అయితే జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ మాత్రం కాస్త నెమ్మదిగా వెళుతున్నాడు. ఇక ఎవరు ఊహించని విధంగా తమిళ హీరోపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

అనుదీప్ మీద నమ్మకంతో

నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం అనుదీప్ మీద నమ్మకంతో నాగ్ అశ్విన్ ధైర్యం చేసి తీసిన ఆ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

వైజయంతిలో పెద్ద సినిమా

జాతిరత్నాలు హిట్టయిన తరువాత డైరెక్టర్ అనుదీప్ కు బడా నిర్మాతల నుంచి భారీ ఆఫర్స్ అయితే వచ్చాయి. అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ అనుదీప్ మాత్రం ముందుగానే స్వప్న సినిమాస్ తో మరో కమిట్మెంట్ తీసుకున్నాడు. వైజయంతిలో కూడా ఒక పెద్ద సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్

ప్రస్తుతం అనుదీప్ వద్ద మూడు కథలు సిద్ధంగా ఉన్నాయట. జాతిరత్నాలు సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఒక ప్రాజెక్ట్ పై క్లారిటీ కూడా ఇచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమా చేయనున్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ అదే కాన్సెప్ట్ తో వస్తాడో లేదో తెలియదు గాని తమిళ హీరోతో మాత్రం మంతనాలు జరుపుతున్నట్లు టాక్ వస్తోంది.

శివకార్తికేయన్ తో కొత్త సినిమా

ప్రస్తుతం ఓ వర్గం దర్శకులు హీరోలు బైలాంగ్యువల్ సినిమాలు చేస్తుండడంతో అనుదీప్ కూడా తమిళ హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. శివకార్తికేయన్. ఆ హీరో తెలుగులో కూడా క్లిక్కవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ సలహతోనే మరోసారి అనుదీప్ సింపుల్ కామెడీ కథతోనే రావచ్చని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ రానుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here