జనతా గ్యారేజ్ బాలీవుడ్ రీమేక్.. స్టార్ హీరోకు అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్?

0
9

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జనతా గ్యారేజ్ 2016లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. మోహన్ లాల్ అందులో ఎన్టీఆర్ పెదనాన్నగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని గత మూడేళ్ళుగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల ఒక బాలీవుడ్ హీరోకు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

ఆ కాంబో స్పెషల్ ఎట్రాక్షన్

మిర్చి – శ్రీమంతుడు వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం దర్శకుడు కొరటాల డైరెక్ట్ చేసిన జనతా గ్యారేజ్ అప్పట్లో విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కు కూడా ఆ సినిమా బాగా హెల్ప్ అయ్యింది. ఇక సినిమాలో మోహన్ లాల్ – ఎన్టీఆర్ కాంబో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

రెండేళ్ల క్రితమే ప్లాన్

ఇక జనతా గ్యారేజ్ సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోతో రీమేక్ చేస్తే బావుంటుందని మైత్రి మూవీ మేకర్స్ రెండేళ్ల క్రితమే ప్లాన్ వేసింది. అయితే తెలుగు సినిమాలతో బిజీగా ఉండడం వలన అటు వైపు వెళ్లలేదు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను సైతం లైన్ లో పెట్టిన మైత్రి వారు బాలీవుడ్ అగ్ర హీరోలతో కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ కు అడ్వాన్స్

ఇక ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసినట్లు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సినిమా రీమేక్ పై చర్చలు జరిపి ఫైనల్ చేయించారని కూడా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముందే కొంత అడ్వాన్స్ ఇచ్చి కమిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు ఎవరు?

అయితే కొరటాల శివ తరహాలో హిందీలో ఆ సినిమాను ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడనేది ఆసక్తిగా మారింది. దర్శకుడి విషయంలో నిర్మాతలు సల్మాన్ ఖాన్ ను ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే రీమేక్ కథలు వచ్చినప్పుడు ఏ దర్శకుడు అయితే బెస్ట్ అనే విషయంలో సల్మాన్ ఖాన్ నిర్ణయం ఫైనల్ అవుతుందని టాక్. ఒకవేళ అంతా సెట్టయితే సినిమా 2023లో సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here