జక్కన్న చెప్పిన సమయానికి RRR హీరోలను విడుదల చేయగలడా..?

0
14

‘బాహుబలి 2’ తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం ”ఆర్.ఆర్.ఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా 2018లో ఈ మూవీని ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల లేట్ అవుతూ వస్తుండటంతో.. ఈ సినిమా విడుదల తేదీలను ఇప్పటికే రెండుసార్లు మార్చారు. ముచ్చటగా మూడోసారి దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో అనుకున్న ప్రకారం చిత్రీకరణ చేయలేకపోయారు. అయినప్పటికీ జక్కన్న మాత్రం అదే రిలీజ్ డేట్ మీద కర్చీఫ్ వేసి కూర్చున్నారు.

ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు పాటల చిత్రీకరణ ఆగస్ట్ నెల లోపు కంప్లీట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తయితే కొత్త ప్రాజెక్ట్స్ షురూ చేయాలని ఎన్టీఆర్ – రామ్ చరణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఇప్పటికే ఓ మూవీ ప్రకటించారు. శంకర్ తో చరణ్ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జక్కన్న చెప్పిన సమయానికి షూటింగ్ కంప్లీట్ చేస్తే సెప్టెంబర్ నుంచి RRR హీరోల తదుపరి చిత్రాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో వచ్చే నేషనల్ వైడ్ క్రేజ్ ని కాపాడుకునేలా ఎన్టీఆర్ – రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారని అర్థం అవుతోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తారక్ – చరణ్ ల ఇమేజ్ కూడా పెరుగుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here