ఖరీదైన కలల కారును చూపించిన జబర్దస్త్ శాంతి స్వరూప్.. మాటలతోనే గాలి తీసేసిన గెటప్ శ్రీను

0
12

జబర్దస్త్ వచ్చిన తరువాత ఒక విధంగా ఇండస్ట్రీలోకి కొత్త తరహా టైమింగ్ ఉన్న కమెడియన్స్ ఎక్కువగానే వచ్చారు. ఇంతకుముందు డైరెక్ట్ గా సినిమాల్లో ఛాన్స్ కావాలి అంటే ఎంతో లక్కుంటే గాని ఎవరు నమ్మేవారు కాదు. కానీ ఇప్పుడు జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా చాలామంది కమేడియన్స్ పుట్టుకొస్తున్నారు. ఇక ఆ షో ద్వారా ఒక కెరీర్ ను సెట్ చేసుకున్న వారిలో శాంతి స్వరూప్ ఒకరు. అయితే ఇటీవల అతను తన కలల కారును చూపించగా గెటప్ శ్రీను మొహమాటం లేకుండా మాటలతోనే గాలి తీసేశాడు.

కొత్తగా చేయడానికి ఫ్రీడమ్..

జబర్దస్త్ అనగానే అందరికి అందులో కామెడీ పంచ్ లు గుర్తుకు వస్తాయి. ఇక కొంతమంది కమెడియన్స్ అందులోనే చాలా కాలంగా కొనసాగుతున్నారు. చాలామంది కమెడియన్స్ కు అదొక మంచి ఉపాధిలా మారింది. కొత్తగా చేయడానికి ఫ్రీడమ్ ఉండడంతో నటనపై ఆసక్తి ఉన్నవారు ముందుగా జబర్దస్త్ వైపు అడుగులు వేస్తున్నారు.

ఏళ్ళు గడుస్తున్నా కూడా.. తగ్గని హవా

2013లో మొదలైన జబర్దస్త్ ప్రయాణం ఆ తరువాత మరో జబర్దస్త్ వచ్చే వరకు తన క్రేజ్ ను పెంచుకుంది. ఏళ్ళు గడుస్తున్నా కూడా రెండు జబర్దస్త్ షోలు కూడా అదే తరహా రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. ఇక కమెడియన్స్ కు కూడా భారీ రెమ్యునరేషన్స్ తో పాటు బయట కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

శాంతి స్వరూప్ ఆస్తులపై రూమర్స్

జబర్దస్త్ తో కొనసాగుతున్న టీమ్ లీడర్స్ తో పాటు మరికొందరు చిన్న తరహా కమెడియన్స్ సొంతంగా ఫ్లాట్స్ కొనుక్కొని సొంతంగా కారు కూడా కొనుగోలు చేశారు. ఇక ఇటీవల శాంతి స్వరూప్ కూడా అలాంటి వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. గతంలోనే శాంతి స్వరూప్ ఆస్తులపై చాలా రూమర్స్ వచ్చాయి.

అందులో ఎలాంటి నిజం లేదని..

శాంతి స్వరూప్ కు సొంతంగా హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ ఉందని అలాగే అతనికి ఒక ఆడి కారు కూడా ఉన్నట్లు రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని శాంతి స్వరూప్ తన యూ ట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సొంత డబ్బులతో స్కూటీ మాత్రమే కొనుగోలు చేశానని అద్దె ఇంట్లోనే ఆనందంగా ఉంటున్నట్లు కూడా తెలిపారు.

14లక్షల విలువగల మహీంద్రా తార్

ఇక ఇటీవల మరొక వీడియో పోస్ట్ చేసిన శాంతి స్వరూప్ అందులో మరొక ఖరీదైన కారును చూపించి ఇది నా కలల కారు అంటూ వివరణ ఇచ్చాడు. 14లక్షల విలువగల మహీంద్రా తార్ కారు అంటే తనకు చాలా ఇష్టమని చెబుతూ దానిపైన రివ్యూ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ప్రతి ఒక్క కమెడియన్ ను కూడా కారు గురించి అడిగి తెలుసుకున్నాడు.

గాలి తీసేసిన గెటప్ శ్రీను

ఇక జబర్దస్త్ గెటప్ శ్రీను వంతు రావడంతో అతను ఒక్క మాటలో గాలి తీసేశాడు. ముందుగా అది నీ కారు కాదని నాకు బాగా తెలుసు. కానీ కారు మాత్రం బావుందని అసలు నిజం చెప్పేశాడు. ఆ మాటతో అతను యూ ట్యూబ్ ఛానెల్ లో సరదాగా చేసిన వీడియో అని అందరికి అర్ధమయ్యింది. జబర్దస్త్ లో చాలామంది సెట్టయ్యారు. అలాగే నువ్వు కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా నీ డ్రీమ్ కారును కొనుక్కునే స్థాయికి రావాలని కూడా ఆశిస్తున్నట్లు గెటప్ శ్రీను పాజిటివ్ గా వివరణ ఇచ్చారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here