క్రాక్ దర్శకుడితో మరోసారి సలార్ బ్యూటీ..??

0
19

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో భారీ యాక్షన్ ‘అఖండ’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ సినిమా పై ఇప్పటికే నందమూరి అభిమానులలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఇదివరకే బాలయ్య – బోయపాటి  కాంబోలో సింహా లెజెండ్ సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొడతారని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తుండగా త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా తర్వాత బాలయ్య తదుపరి సినిమా గురించి సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఇదివరకే తెలిపినట్లుగా ఈ ఏడాది క్రాక్ మూవీతో భారీ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో కమర్షియల్ సినిమాగా బాలయ్యతో ప్లాన్ చేశారు. ఆ సినిమాకోసం  దర్శకుడు గోపిచంద్ మలినేని మంచి మాస్ అంశాలతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు గోపీ బాలయ్య స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉండగా.. సినిమా పల్నాటి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని టాక్.

బాలయ్య అఖండ మూవీ పూర్తి అయిపోగానే గోపితో సినిమా పట్టాలెక్కుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. కొన్నిరోజులుగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పేరు విపరీతంగా వినిపిస్తుంది. పరిస్థితి చూస్తుంటే బాలయ్య సినిమాలో శృతి ఖరారు అయినట్లుగా సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ గోపీచంద్ తో ఇదివరకు శృతిహాసన్.. బలుపు – క్రాక్ సినిమాలు చేసింది. అవి రెండు కూడా సూపర్ హిట్స్. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గోపీచంద్ శృతిని ఒప్పించాడని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here