‘కేజీఎఫ్-2’ వచ్చేది అప్పుడేనా..??

0
20

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కేజీఎఫ్-2 ఒకటి. 2018 డిసెంబర్ నెలలో కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే విడుదలైన ఐదు భాషల్లో సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్డం అందుకున్నారు యాక్టర్స్ – మేకర్స్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ మూవీ సాలిడ్ హిట్ కొట్టి ఊహించని రేంజిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ మూవీ గురించి రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదివరకు టీజర్ తో పాటుగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అప్పటినుండి సినీ ప్రేక్షకులలో సీక్వెల్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకముందే సెకండ్ పార్ట్ షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. గతేడాదిలోనే కేజీఎఫ్ సీక్వెల్ షూట్ మొత్తం పూర్తి చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చిందట. ప్రస్తుతం ఈ సినిమా విడుదల గురించి ఇండస్ట్రీ వర్గాలలో పలు చర్చలు నడుస్తున్నాయి. అసలే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కలిగిన ఈ సినిమాలో మరో క్రేజీ మసాలా సాంగ్ కూడా ఉండబోతుందని వార్తలొస్తున్నాయి.

మరి ఈసారి సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉండబోతుందిని టాక్. తాజా సమాచారం ప్రకారం.. కేజీఎఫ్ సీక్వెల్ మూవీ జులై 16న విడుదల కష్టమని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో ఆ టైంలో.. అంటే దసరా పండుగ వేళలో కేజీఎఫ్-2 రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఎంత లేట్ అయినా సినిమా లేటెస్ట్ గానే ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లాగే ఈ సీక్వెల్ లో  ప్రేక్షకులను కూర్చోబెట్టే సీన్స్ చాలా ఉన్నాయని అందుకే ఈ విధంగా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి హీరోయిన్ కాగా విజయ్ కిరగందుర్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here