కళ్యాణ్ రామ్ కాదు..ఎన్టీఆర్ కావాలి

0
24

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న డైరక్టర్ అనిల్ రావిపూడి. ఈ దర్శకుడు బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు టాక్ నడుస్తోంది. నిజానికి బాలకృష్ణ 100వ సినిమాను అనిల్ రావిపూడి చేయాలని చూశాడుగానీ వర్కవుట్ కాలేదు. ఇక  ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది. ‘ఎఫ్ 3’ పూర్తయిన తరువాత బాలకృష్ణ ప్రాజెక్టుపైనే అనిల్ రావిపూడి కూర్చోనున్నాడని చెప్పుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది.

అయితే కళ్యాణ్ రామ్ సీన్ లోకి వచ్చినా ‘నందమూరి ఫ్యామిలీ హీరోస్’ మల్టీస్టారర్ అన్నా క్రేజ్ రావటం లేదు. చేస్తే ఎన్టీఆర్ తో బాలయ్య చేయాలి. అప్పుడు అది మల్టి స్టారర్..క్రేజ్ తెచ్చే ప్రాజెక్టు అవుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. రైటే కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫుల్ బిజీ. బాలయ్యతో సినిమా చెయ్యాలంటే ఖాలీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడప్పుడే ఆ కోరిక తీరక పోవచ్చు అని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే  ఈ సినిమా కంటే ముందే బాలకృష్ణ ‘అఖండ’లోనూ కళ్యాణ్ రామ్ కొద్దిసేపు మెరియబోతున్నాడని ఓ టాక్ నడుస్తోంది. ఇవన్నీ వింటానికి బాగానే ఉంటున్నాయి. నిజమయ్యేది ఎప్పుడు అనేది సగటు అభిమాని ప్రశ్న.

ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ అందరి దృష్టి ఇప్పుడు ‘అఖండ’ సినిమాపై ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వాళ్లంతా కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ‘క్రాక్’ సినిమా చూసిన బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని మేకింగ్ టేకింగ్ తెగ నచ్చేసి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు లాంచ్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here