కమల్ హాసన్ రాజీ ప్రయత్నాలు

0
22

విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం భారతీయుడు 2 (ఇండియన్ 2) రకరకాల వివాదాల వల్ల షూట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. లైకా సంస్థతో శంకర్ కి ఈగో సమస్యలు కోర్టు గొడవల నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అర్థాంతరంగా నిలిచిపోవడంపై కమల్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

చాలావరకూ సినిమాని పూర్తి చేశాక ఇలా జరగడం లైకా సంస్థకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా?  శంకర్ – లైకా ప్రొడక్షన్స్ నడుమ ఈగో సమస్యలను తొలగించే ప్రయత్నాలు సాగడం లేదా? అంటే.. ఇప్పుడు కమల్ హాసన్ దీనికి పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.

శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2ని పూర్తిగా వదిలేసి తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. అందుకు అతడికి కోర్టు తీర్పు కూడా అనుకూలంగా ఉంది. మరోవైపు లైకా సంస్థ తమ కాంట్రాక్టును పూర్తి చేయకుండా వేరే సినిమాలు చేస్తున్నాడని ఆవేదనను వ్యక్తపరుస్తోంది.

ఇప్పుడు కమల్ హాసన్ ఎన్నికల్లో ఓడిపోయి పూర్తి స్వేచ్ఛగా ఉన్నారు. ఆ క్రమంలోనే భారతీయుడు 2 వివాదాలపై దృష్టి సారించి తనే స్వయంగా దీనిని పరిష్కరించేందుకు నాయకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది.

తాజా సమాచారం మేరకు.. కమల్ హాసన్ చాలా మంది సినీనిర్మాతలను కలుస్తున్నారు. దీంతో పాటే.. శంకర్ తో  లైకా సమస్యలను పరిష్కరించడానికి ఇతరులను ఇన్వాల్వ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందనే భావిస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ తన కొత్త చిత్రం విక్రమ్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here