ఓటీటీలో ఆకాష్ పూరీ ‘రొమాన్స్..’?

0
20

సినిమా ఇండస్ట్రీకి అత్యంత కీలకమైన సమ్మర్ సీజన్ ను.. వరుసగా రెండో ఏడాది కూడా కొవిడ్ మింగేసింది. దీంతో.. చేసేది లేక పెద్ద చిత్రాలన్నీ వెనక్కు వెళ్లిపోయాయి. అయితే.. మరీ ఎక్కువ కాలం వెయిట్ చేయలేని చిన్న చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి.

ఇప్పటికే ‘థాంక్యూ బ్రదర్’ వంటి చిత్రాలు ఓటీటీ తెరపైకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతోందని సమాచారం. ఆకాష్ హీరోగా.. కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘రొమాంటిక్’.

అనిల్ పాదూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే సైతం కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ ఇప్పటికే సిద్దమైందని.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్.

అయితే.. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోందని గతంలోనే ప్రచారం జరిగింది. ఏం జరిగిందో ఏమోగానీ.. తాజాగా నెట్ ఫ్లిక్స్ తెరపైకి వచ్చింది. ఈ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందని దీంతో.. ఆకాష్ రొమాన్స్ నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుందనే చర్చ సాగుతోంది.

పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై.. పూరీ జగన్నాథ్ ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంతో మందికి బ్లాక్ బస్టర్  హిట్స్  ఇచ్చిన పూరీ.. తనయుడికి మాత్రం ఇప్పటి వరకు మంచి హిట్ ఇవ్వలేకపోయాడు. మరి ఈ చిత్రంతోనైనా హిట్ ఇస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here