ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్..?

0
25

టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచిన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’. పృథ్వీరాజ్ – సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో దీన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాపై ముచ్చటపడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్ లో చేయడానికి రీమేక్ రైట్స్ తీసుకున్నారని టాక్ వచ్చింది. కానీ ఇంతవరకు ఈ రీమేక్ పై అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో లేటెస్టుగా విక్టరీ వెంకటేష్ ఇందులో నటించనున్నారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా ప్రముఖ హీరో మరియు అతన్ని అభిమానించే ఓ బ్రేక్ ఇన్ స్పెక్టర్ మధ్య అనుకోని పరిస్థితుల వల్ల ఏర్పడిన గొడవ నేపథ్యంలో రూపొందింది. ఇప్పుడు తెలుగు రీమేక్ లో బ్రేక్ ఇన్ స్పెక్టర్ రోల్ లో వెంకీ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ కథలో కనిపించే స్టార్ హీరో పాత్ర కోసం తెలుగు ప్రేక్షకులను సుపరిచితమైన తమిళ హీరోని తీసుకోవాలని అనుకుంటున్నారట. అంతేకాదు దీని కోసం కోలీవుడ్ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ లేదా శింబు ని తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం. మరి ఇప్పటికైనా ఈ వార్తలు నిజమై ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here