‘ఐకాన్’ ప్రస్తావన అందుకే హైలైట్ చేస్తున్నారా..??

0
22

కరోనా మహమ్మారి లాక్డౌన్ ముగిసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఫస్ట్ సినిమా వకీల్ సాబ్ విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హంగులతో వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల అయ్యేందుకు సర్వం సిద్ధం అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రొడ్యూసర్ దిల్ రాజు.. అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో దూకుడుగా ప్రచారం మొదలు పెట్టనున్నాడట. వకీల్ సాబ్ డైరెకర్ వేణు శ్రీరామ్ ప్రమోషన్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడట. కానీ మొత్తానికి వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ప్రమోషన్స్ ఘనంగా ప్లాన్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 3న యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ-రిలీజ్ ప్రోగ్రాం జరగనుంది.

ఇదిలా ఉండగా.. దిల్ రాజు – వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ హీరోగా గతంలో ఐకాన్ అనే సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఎందుకోగాని సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు వకీల్ ప్రమోషన్స్ టైంలో ఆ ఐకాన్ సినిమా గురించి పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఐకాన్ సినిమా ప్రస్తావన రావడానికి కారణం వేరే ఉందంటూ మరికొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ మూవీ పై ఇంటెన్షన్ పెంచడానికే ఇలా వదంతులు క్రియేట్ చేసారని.. వేణు శ్రీరామ్ కు బిగ్ రిలీజ్ అవుతుందనే ఆలోచనతో ఇలా చేస్తున్నారంటూ టాక్. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ కాబట్టి.. పవన్ కళ్యాణ్ ఆన్ బోర్డులో ఉన్నప్పుడు ఈ సినిమాను ఎలాగైనా పిలవచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒరిజినల్ నుండి మార్పులు చేసి ఈ సినిమాలో పవన్ కు ఓ హీరోయిన్ క్యారెక్టర్ సెట్ చేశారు. చూడాలి మరి వకీల్ సాబ్ ఏం చేయనున్నాడో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here