ఎన్టీఆర్ కు బాలీవుడ్ బ్యూటీ ‘నో’ చెప్పలేకపోయిందా..?

0
21

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తరువాత చేయబోయే రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో తారక్ సినిమాలు చేయనున్నాడు. ఎన్టీఆర్ లైనప్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత తమ అభిమాన హీరో మళ్ళీ కొరటాలతో చేస్తున్న ‘#NTR30’ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి డైలీ ఏదొక న్యూస్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్టుగా ఇందులో తారక్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి డిస్కషన్ జరుగుతోంది.

కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘భరత్ అనే నేను’ అనే బ్లాక్ బస్టర్ సినిమాతో గ్రాండ్ ఇచ్చిన కియరా.. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ సినిమాతో ప్లాప్ అందుకుంది. ఈ క్రమంలో అమ్మడు మరో తెలుగు సినిమాకి సైన్ చేయలేదు. ఎంతో మంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ డేట్స్ కోసం ట్రై చేశారు కానీ.. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఒక్క సినిమా కూడా సెట్ అవలేదు. అయితే ‘#NTR30’ కోసం కియరాని ఒప్పించడంలో మేకర్స్ సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

కొరటాల శివ చేతుల మీదుగా టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయిన కియారా అద్వానీ.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కే పాన్ సినిమా కావడం.. ఎన్టీఆర్ లాంటి స్టార్ తో నటించే అవకాశం రావడంతో ‘#NTR30’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇతర ప్రాజెక్ట్స్ డేట్స్ అడ్జెస్ట్ చేసి మరీ అమ్మడు ఈ సినిమాకి సైన్ చేసిందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here