ఉదయనిధి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా..!

0
29

తమిళనాడులో ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎం.కె.స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన తనయుడు సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ చెన్నై నగరంలోని చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 40 వేల కోట్ల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాక ముందు సినీ హీరో గా బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఉదయనిధి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తో ఇక సినిమాలకు గుడ్ బై చెబుతాడని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉదయనిధి స్టాలిన్ 2008లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెడ్ జైంట్  మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారాడు. తన మొదటి సినిమాగా దళపతి విజయ్ త్రిష హీరోహీరోయిన్లుగా ‘కురువి’ అనే సినిమాను నిర్మించాడు. 2009లో ఆధవన్ 2010లో శింబు నయనతార కాంబినేషన్ లో తెరకెక్కిన మన్మధన్ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఉదయనిధి  అంబు  సెవెంత్ సెన్స్ సినిమాలను నిర్మించాడు.

   వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సమయంలోనే 2012లో ‘ఓరు కల్ ఓరు కన్నడి’  సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా తెలుగులో కూడా ‘ఓకే ఓకే’ పేరుతో రిలీజ్ అయింది. కాగా ఉదయనిధి ఎమ్మెల్యేగా ఎన్నికఅవడంతో  ఇక సినిమాలకు గుడ్ బై చెబుతాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఉదయనిధి తండ్రి స్టాలిన్ నుంచి ఎటువంటి అధికారిక  ప్రకటన రాలేదు. ఉదయనిధి ఇక సినిమాలు మానేస్తాడని వస్తున్న ప్రచారం అంతా వట్టి పుకార్లేనని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఉదయనిధి  నటిస్తున్న మూడు మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here