ఈ మల్లు బ్యూటీకి టాలీవుడ్ మెగా పిలుపు అందిందా..??

0
35

దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రతిభ కలిగిన హీరోయిన్స్ చాలానే ఉన్నారు. కానీ నటనతో పాటు మల్టీటాలెంట్స్  కలిగిన వారు తక్కువ. అందులోను వేరే భాష నుండి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పడం అంటే మాములు విషయం కాదు. అలాంటి మల్టీటాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు మాళయాళీ మమత మోహన్ దాస్. మొదటగా తెలుగు ఇండస్ట్రీకి గాయనిగా పరిచయమైంది. స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా టైటిల్ సాంగ్ పాడి సెన్సేషన్ క్రియేట్ చేసిన మమత.. ఆ వెంటనే ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. అనంతరం గాయనిగా ఆకలేస్తే అన్నం పెడతా.. అంటూ మెగాస్టార్ సినిమాలో సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ పాడింది. మమత తెలుగులో సింగర్ గా సక్సెస్ అయింది కానీ నటిగా సక్సెస్ కాలేకపోయింది.

తెలుగులో వెంకీతో చింతకాయల రవి నాగార్జునతో కేడి సినిమాలు చేసింది కానీ ఏ సినిమాతోనుగుర్తింపు రాలేదు. కేడి సినిమా తర్వాత అమ్మడు తెలుగుకు గుడ్ బై చెప్పేసింది. ఇక లైఫ్ లో క్యాన్సర్ వ్యాధిని కూడా గెలిచింది అమ్మడు. కొంతకాలానికి మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టింది. కానీ తెలుగు వైపు మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మమత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ‘లాల్ భాగ్’ అనే త్రిభాషా చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా తెలుగు తమిళ మలయాళం భాషల్లో విడుదల కాబోతుందట. ఇదిలా ఉండగా.. తాజాగా మెగాస్టార్ కాంపౌండ్ నుండి మమతకి పిలుపు వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ప్రస్తుతం యాక్టింగ్ చేస్తోంది కాబట్టి మెగాస్టార్ తన అప్ కమింగ్ సినిమాల్లో అవకాశం ఇస్తారేమో అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here