ఈ ఏడాదే రకుల్ పెళ్లి కబురు..??

0
27

టాలీవుడ్ జనాలకు హీరోయిన్ రకుల్ ప్రీత్ బాగానే సుపరిచితం. ఎందుకంటే తెలుగులో దాదాపు అందరూ హీరోలతో సినిమాలు చేసేసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగుతో పాటు తమిళ హిందీ సినిమాలు కూడా  లైన్ లో పెట్టేసింది. ప్రెసెంట్ రకుల్ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో రకుల్  జయజానకినాయక సినిమా తర్వాత హిట్టు కొట్టలేదు. కింగ్ నాగ్ తో మన్మధుడు-2 రొమాన్స్ ఫెయిల్ అయింది. అలాగే ఈ ఏడాది చెక్ సినిమాలో నటించింది. కానీ చెక్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్రామీణ నేపథ్యం కలిగిన మూవీ చేసింది. ప్రస్తుతం హిట్టు కంపల్సరీ కావడంతో సినిమా పై భారీ ఆశలే పెట్టుకుంది.

అయితే హిందీలో ఎటాక్ సర్దార్ అండ్ గ్రాండ్ సన్ మేడే సినిమాలతో.. తమిళంలో పాన్ ఇండియా మూవీ ఇండియన్-2 తో పాటు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమాలు చేస్తోంది. మొత్తానికి రకుల్ ప్రీత్ టైం ఫుల్ స్వింగ్ లో ఉందనే అనిపిస్తుంది. అయితే సినిమాల విషయం పక్కనపెడితే.. ఇండస్ట్రీలో కొంతకాలంగా పెళ్లిళ్ల గోల ఎక్కువైపోయింది. అలాగే హనీమూన్ స్పాట్ మాల్దీవ్స్ గోల బాగానే వినిపిస్తుంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ – మంచులక్ష్మీ ఇద్దరూ కలిసి రానా హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘నెం1యారీ’ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రకుల్ పెళ్లి ఊసు కూడా లేవనేత్తింది మంచులక్ష్మీ. రకుల్ పెళ్ళెప్పుడు అని రానా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ఈ ఏడాదే కావచ్చు లేదా ఈ ఏడాది బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియవచ్చు’ అని చెప్పింది. రకుల్ నో అని తలూపింది కానీ ఎక్కడో ఆమెకి కూడా పెళ్లి పై మనసు మళ్ళినట్లే ఉందేమో అని కథనాలు వినిపిస్తున్నాయి. అదిగాక ఆ మధ్యలో రకుల్ సింగిల్ గానే మాల్దీవ్స్ కి వేకెషన్ వెళ్లొచ్చింది. అందరు హీరోయిన్స్ పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్తుంటే రకుల్ మాత్రం ఒంటరిగా వెళ్ళి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రకుల్ పెళ్లి న్యూస్ మరోసారి వార్తల్లో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here