ఈసారి వెంకీ తో కలిసి ‘ఫిదా’ చేయనున్నారా..?

0
19

ప్రస్తుతం ‘ఎఫ్3’ ‘గని’ సినిమాలలో నటిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ‘ఛలో’ ‘భీష్మ’ వంటి రెండు వరుస విజయాలు అందుకున్న వెంకీ.. మూడో సినిమాని మెగా హీరోతో చేయడానికే నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

నిజానికి వెంకీ కుడుముల ‘భీష్మ’ సక్సెస్ అయిన వెంటనే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి బాగా ట్రై చేశాడు కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి వెంకీ రెడీ అయ్యారని అంటున్నారు.

అంతేకాదు ఇందులో వరుణ్ సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ – సాయి పల్లవి ఇంతకుముందు ‘ఫిదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల తో కలిసి ఈ జంట చేసిన అల్లరికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇద్దరూ తమ పాత్రకు తగ్గట్లు చక్కటి నటనతో ఆకట్టుకుని సినిమా విజయానికి కారణమయ్యారు.

‘ఫిదా’ సినిమాతో హిట్ ఫెయిర్ గా మారిపోయిన వరుణ్ తేజ్ – సాయి పల్లవి జంటను మరోసారి వెండితెరపై చూపించాలని దర్శకుడు వెంకీ కుడుముల  ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నారట. నాలుగేళ్ల తర్వాత వరుణ్ – సాయిపల్లవి కలిసి నటించనున్నారనే వార్తల్లో నిజమెంతో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here