ఇటు పవన్ అటు విజయ్.. ఇద్దరిలో ఎవరితో..!

0
35

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి 13 ఏళ్ల సినీ కెరీర్ లో కేవలం ఐదు సినిమాలకే దర్శకత్వం వహించి స్లో అండ్ స్టడీగా వెళ్తున్నాడు. చివరగా ‘మహర్షి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వంశీ.. ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కక్లారిటీ ఇవ్వలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వెంటనే మరో సినిమా చేయనున్నాడని న్యూస్ వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. దీంతో వంశీ తదుపరి సినిమా ఆ హీరోతో ఈ హీరోతో గత రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఏదీ నిజం కాలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరో ఒకరితో వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో లేదా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఒకవైపు పవన్ కు ఓ స్టోరీ లైన్ వినిపించారని.. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ వినిపిస్తారని అనుకుంటున్నారు. మరోవైపు విజయ్ తో వంశీ ఓ బైలింగ్వల్ ప్లాన్ చేస్తున్నారని.. విజయ్ నటించబోయే 66వ చిత్రం ఇదేనని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా దిల్ రాజు బ్యానర్ లోనే రూపొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇద్దరిలో ఎవరితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా వంశీ పైడిపల్లికి జాక్ పాట్ అందినట్లే. ఇటీవల ‘మహర్షి’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. నెక్స్ట్ సినిమా మరింత బాధ్యతగా తీస్తాడని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here