‘ఆర్.ఆర్.ఆర్’ ప్లేస్ లో ‘పుష్ప’ పార్ట్-1..?

0
25

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా అప్పటికి రెడీ అయ్యే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా చేసే అంశాన్ని తెర మీదకు తెచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కంటెంట్ ని 2 పార్ట్స్ గా చేయొచ్చని సుక్కూ ఆలోచించారట. ఫస్ట్ పార్ట్ లో లారీ డ్రైవర్ పుష్పరాజ్ ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా ఎలా మారాడు అనేది చూపిస్తారట. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టి రెండో భాగాన్ని కొసాగిస్తారట. దీంట్లో పెద్ద డాన్ గా ఎదిగిన పుష్పరాజ్ కు విలన్ ఫహాద్ ఫాజిల్ మధ్య వైరాన్ని మెయిన్ గా చూపిస్తారని అంటున్నారు.

ప్రస్తుతానికి చిత్రీకరణ చేసిందంతా ఫస్ట్ పార్ట్ కి సరిపోతుందట. ఇప్పుడు రెండు భాగాలుగా ప్లాన్ చేసిన దానికి తగ్గట్టుగా ఇంకో 15 – 20 రోజుల షూటింగ్ చేస్తే సినిమా రెడీ అయిపోతుందని టాక్. పరిస్థితులు అనుకూలిస్తే మిగతా షూట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ‘పుష్ప’ పార్ట్-1 ని దసరా బరిలో నిలపాలని సుక్కూ అండ్ టీమ్ ఆలోచన చేస్తోందట. ఇప్పటికే అక్టోబర్ 13వ తేదీని బ్లాక్ చేసుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చే ఏడాదికి వాయిదా పడనుందని అంటున్నారు. ఇప్పుడు అదే డేట్ కి రావాలని చూస్తున్న ‘పుష్ప’ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి. ‘బాహుబలి’ మాదిరిగా రెండు పార్ట్స్ చేసే విషయంపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఇకపోతే ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here