ఆర్ఆర్ఆర్ గత ఏడాది ప్రకటించినట్లుగానే రిలీజ్.. కాని!

0
17

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. టాలీవుడ్ ఇద్దరు సూపర్ స్టార్స్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ కమ్ భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ నుండి కోలీవుడ్.. శాండల్ వుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఈ సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా మొత్తం తలకిందులు అయ్యింది. దాంతో సినిమాను 2022 దసరాకు వాయిదా వేశారు. షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయంలో సెకండ్ వేవ్ మొదలై మళ్లీ ఆగిపోయింది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ బ్యాలన్స్ వర్క్ కొన్ని రోజుల్లో ముగించే అవకాశం ఉంది. పరిస్థితులు చక్కబడ్డ వెంటనే జక్కన్న షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉంది. కాని సినిమాను అనుకున్నట్లుగా దసరాకు విడుదల చేయడం సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వాదన వినిపిస్తుంది. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. జకన్న అండ్ టీమ్ ప్రస్తుతం సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై యూనిట్ సభ్యులతో పాటు కొందరు నిర్మాతలతో కూడా చర్చలు జరుపుతున్నారట.

వచ్చే ఏడాది దసరాకు పెద్ద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ బెర్త్ లను ముగ్గురు నలుగురు హీరోలు బుక్ చేసుకున్నారు. వారిలో కరోనా కారణంగా ఎంత మంది ఆలస్యంగా వస్తారనేది చూడాలి. ఒకటి రెండు సినిమాలు ఉంటే వారితో చర్చలు జరిపి గత ఏడాది అనుకున్నట్లుగానే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని జక్కన్న టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే 2021 సంక్రాంతికి వీలు పడలేదు కాని 2022 సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వస్తామంటూ అభిమానులకు మేకర్స్ అనఫిషియల్ గా హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here