ఆర్ఆర్ఆర్ అప్డేట్.. హీరోల కలయిక సీన్ అద్బుతం

0
23

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. చివరి షెడ్యూల్ జరుపుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యి షూటింగ్ ఆగిపోయింది. వచ్చే నెలలో మళ్లీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సినిమా లోని 20 నిమిషాలు ఉండే ఒక భారీ యాక్షన్ సన్నివేశం సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటుందంటున్నారు.

ఆ 20 నిమిషాల యాక్షన్ సన్నివేశంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఎదురు పడబోతున్నారు. ఆ ఫైటింగ్ సన్నివేశం కోసం భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ను ఉపయోగించడంతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా వర్క్ చేయించారు. టాలీవుడ్ లోనే కాకుండా ఇప్పటి వరకు బాలీవుడ్ లో కూడా ఇంతటి భారీ యాక్షన్ సన్నివేశంను ప్రేక్షకులు చూసి ఉండరు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఆ ఒక్క సన్నివేశం కోసం జక్కన్న చాలా రోజులు షూట్ చేశాడట.

ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలతో పాటు ఈ సీన్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సన్నివేశం కోసం కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్బుతం అన్నట్లుగా ఉంటుందంటూ వారు చెబుతున్నారు. మొత్తంగా సినిమా రేంజ్ ను రెట్టింపు చేసేలా ఆ 20 నిమిషాల సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. సినిమా ను అక్టోబర్ లో విడుదల చేస్తామని జక్కన్న ప్రకటించారు. కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి వాదన. త్వరలోనే విడుదల విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here