‘ఆదిపురుష్’ సెట్ లో అలాంటి రూల్స్ పాటిస్తున్నారట..!

0
92

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ”ఆదిపురుష్”. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీతగా బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తున్నారు. అలానే రావణుడిగా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. అయితే ముంబైలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ లలో ఈ మధ్య చాలా మంది స్టార్స్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అందుకే ‘ఆదిపురుష్’ టీమ్ లో ఎవరికీ కరోనా సోకకుండా ఉండేలా సెట్ లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. షూటింగ్ స్పాట్ లో 25మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉండకూడదని డైరెక్టర్ ఓం రౌత్ కండిషన్ పెట్టారని తెలుస్తోంది. అలాగే షూటింగ్ కి ప్యాకప్ చెప్పగానే సెట్ మొత్తాన్ని శానిటైజ్ చేయిస్తున్నారు. ఇలా కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తల మధ్య ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వచ్చే నెల రెండోవారం వరకూ ప్లాన్ చేశారని సమాచారం.

ఇదిలావుండగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ‘ఆదిపురుష్’ నుంచి రాముని అవతారంలో ప్రభాస్ లుక్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. 3డీ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ లు ఓం రౌత్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here