‘ఆదిపురుష్’ సీత గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్

0
24

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ ఆదిపురుష్ షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో సుదీర్ఘ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా లో సీత పాత్రలో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న హీరోయిన్ కృతి సనన్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలో కృతి సనన్ పాత్ర గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.

ముఖ్యంగా ఆమె పాత్ర ను పరిచయం చేసే క్రమం చాలా విభిన్నంగా ఉంటుందట. హీరో రేంజ్ లో పాత్రను హైలైట్ చేసి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కృతి సనన్ పాత్ర విభిన్నంగా ఉండటంతో పాటు అందరిని ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీత గురించి ప్రస్తుతం తెలిసిన విషయాలు కొన్నే. కాని ఆదిపురుష్ లో సీత పాత్ర గురించి చెప్పబోతున్న విషయాలు అత్యంత విభిన్నంగా ఉంటాయని అంటున్నారు.

ప్రభాస్ ఈ సినిమా లో రాముడిగా కనిపించబోతు ఉండగా.. లంకేషుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్టింగ్ ను నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో యూనిట్ సభ్యులు అంతా కూడా పాల్గొనబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here