‘ఆదిపురుష్’ లో మరో సూపర్ స్టార్

0
31

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా వల్ల బ్రేక్ పడ్డట్లుగా తెలుస్తోంది. షూటింగ్ నిలిచి పోయినా వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం కంటిన్యూ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో సాగుతుందనే విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తూ ఉండగా రావణుడిగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమా లో నటించబోతున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆదిపురుష్ తో కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన్ను దర్శకుడు సంప్రదించడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట. తర్వాత షెడ్యూల్ లో సుదీప్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా కూడా చెబుతున్నారు. సినిమా లోని కీలక పాత్రలో ఆయన కనిపిస్తాడని అంటున్నారు. స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే అయినా కూడా పాత్ర ప్రాముఖ్యత మరియు రామాయణంలో ఆ పాత్రకు ఉన్న పేరు కారణంగా సుదీప్ ఆ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిపురుష్ ఈ సినిమాను ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. భారీ మోషన్ గ్రాఫిక్స్ విజువల్ వండర్ మూవీగా ఈ సినిమా ను ఆయన తీర్చి దిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. కరోనా వల్ల షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది కనుక విడుదల తేదీ ఏమైనా మార్చే అవకాశం ఉందా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here