ఆదిపురుష్ బృందం లైఫ్ రిస్క్ చేయబోతున్నారా..?

0
22

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఎందుకంటే బాహుబలి సినిమా నుండి ప్రభాస్ సినిమాలకోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అలాగే టాలీవుడ్ ప్రేక్షకులలాగే వారు కూడా ప్రభాస్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ సాలిడ్ యాక్షన్ మూవీ సలార్ తో పాటు పౌరాణికచిత్రం ఆదిపురుష్ షూటింగ్ కూడా ఒకే ఫ్లోలో ఫినిష్ చేసుకుంటూ పోతున్నాడు. ఇంతలో కరోనా మహమ్మారి విజ్రుంభించింది షూటింగ్స్ సినిమాలు థియేటర్స్ అన్ని ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అందుకే మేకర్స్ యాక్టర్స్ కూడా ఎవరిళ్లకు వారే పరిమితం అయిపోయారు.

అయితే అసలే సినిమాలు షూటింగ్స్ లేక సెలబ్రిటీలకు కూడా ఏమి పాలుపోవడం లేదట. అందుకే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏంటంటే.. తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబైలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆదిపురుష్ రెండు నెలల షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇంకా మూడు నెలల షూటింగ్ బాలన్స్ ఉందట. అయితే ఫస్ట్ నుండి కూడా ఆదిపురుష్ షూటింగ్ ముంబైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా ఇండోర్ లోనే షూట్ జరుపుకుంటుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ బృందం త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ జరిపే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ముంబైలో కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండటంతో లాక్డౌన్ పడి షూటింగ్ జరిపే అవకాశం లేదు. అందుకే ఆదిపురుష్ బృందం హైదరాబాద్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నట్లు టాక్. అయితే హైదరాబాద్ లో కూడా ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు. ఒకవేళ ఆదిపురుష్ బృందం నిజంగానే ఇలాంటి ఆలోచనలో ఉంటే మాత్రం రిస్క్ చేసినట్లే అంటూ నేటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓసారి హైదరాబాద్ లో షూట్ ప్లాన్ చేసేముందు ఇదివరకు కరోనా బారినపడిన చిత్రబృందాలను గుర్తు తెచ్చుకోవాలని వారు సూచిస్తున్నారు. మరి నిజంగానే ప్రభాస్ టీమ్ రిస్క్ తీసుకోనుందా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here