నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన సెకండ్ మూవీ ‘టక్ జగదీష్’. 2021 వేసవి కానుకగా విడుదల అవుతున్న సినిమాల్లో ఇది ఒకటి. అలాగే ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో టక్ జగదీష్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా పాటలు టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసాయి. మజిలీ సినిమాకు బాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన తమన్.. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ శివ కూడా ఇదివరకు తీసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా పై అదే స్థాయి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఐతే తాజాగా విడుదల చేసిన టక్ జగదీష్ టీజర్ పై సోషల్ మీడియాలో ఎన్నో ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి.
టీజర్ చూసాక ఈ సినిమా ఓల్డ్ బలరామకృష్ణులు సినిమా ఛాయలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తుంది. తాజాగా ఓ సమావేశంలో మీడియా వ్యక్తి ఇదే ప్రశ్నను డైరెక్టర్ శివను అడిగాడు. దానికి ఆయన స్పందించి.. ‘ఈ సినిమా బలరామకృష్ణులు’ సినిమాను పోలి ఉంది అనే వార్తలు నిరాధారమైనవి. మేం కూడా వార్తలు చదువుతూనే ఉన్నాం. ఈ సినిమాలో జగపతిబాబు గారు నానికి అన్నగా నటించడం వలన అలా రాసినట్లున్నారు. కానీ నిజం కాదు. ఒకవేళ నేను ఓ ఇన్నోసెంట్ అబ్బాయి.. ఓ గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడే కథతో సినిమా తీస్తే మీడియా వారు ఓల్డ్ చంటి సినిమాతో పోలుస్తారు. అవన్నీ సర్వసాధారణం’ అని చెప్పుకొచ్చాడు. పక్కనే ఉన్న నాని కూడా ఇలాంటి పబ్లిసిటీ మా సినిమాకు ప్లస్ అవుతుందని అనడం గమనార్హం. టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల కాబోతుంది.