అప్పుడు చరణ్ తో ఇప్పుడు బన్నీతో..!

0
33

నాని హీరోగా తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న జెర్సీ సినిమా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. జెర్సీతో స్టార్ హీరోల దృష్టిలో పడ్డ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీలో జెర్సీ ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే తెలుగులో ఒక స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఉందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట ఈయన మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. చరణ్ కు స్టోరీ వినిపించాడని.. ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది.

రామ్ చరణ్ తో మూవీ పట్టాలెక్కలేదు. చరణ్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల గౌతమ్ తిన్ననూరి మరో హీరోతో సినిమాకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈయన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో కథ చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. బన్నీకి కథ నచ్చిందట. త్వరలోనే బన్నీ సూచించిన మార్పులతో త్వరలోనే అల్లు అరవింద్ కు కూడా గౌతమ్ కథ చెప్పబోతున్నట్లుగా మెగా కాంపౌండ్ లో టాక్ వినిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి ఈ ఏడాది చివర్లో కొత్త సినిమాను మొదలు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

జెర్సీ సినిమా హిందీలో సక్సెస్ అయితే ఈయనకు అక్కడ నుండి కూడా వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అల్లు అరవింద్ హిందీ జెర్సీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. గౌతమ్ తదుపరి సినిమా కూడా అల్లు అరవింద్ నిర్మాణంలో ఉంటుందట. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్నాడు. దాని తర్వాత సినిమా ఏంటీ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. త్వరలోనే బన్నీ తదుపరి సినిమా విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది గౌతమ్ తిన్ననూరి తోనే అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here