అగ్ర బ్యానర్ లో కీరవాణి వారసుడి మూడో చిత్రం

0
18

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహా కొడూరి హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సింహ `మత్తు వదలరా` చిత్రంతో కథానాయకుడిగా ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయ్నతం చేసాడు. కరోనా వైరస్ మొదటివేవ్ సమయంలో రిలీజవ్వడం సినిమాకి మైనస్ అయ్యింది. ఆ తర్వాత దేశం  ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందో తెలిసిందే. ద్వితీయ ప్రయత్నం తెల్లవారితే గురువారం అనే చిత్రంలో సింహా నటించగా అది డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం అతడి మూడో సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతోందని సమాచారం.

మధుర ఎంటర్ టైన్ మెంట్స్ -సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రానా నిర్మాతగా సింహా హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందని టాక్ . అయితే దర్శకుడు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. మధుర శ్రీధర్ కేవలం నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడా?  లేక  కెప్టెన్ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారా? అన్నది క్లారిటీ లేదు. ఇక సురేష్  ప్రొడక్షన్స్ లో సినిమా రిలీజ్ అంటే గ్రాండ్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. పైగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కీరణవాణి ఫ్యామిలీకి మంచి అనుబంధం కూడా ఉంది. అందుకే సురేష్ బాబు అండ్ కో  నిర్మించడానికి ముందుకొచ్చినట్లు  తెలుస్తోంది.

ఇక మత్తు వదలరా చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. చెర్రీ -హేమలత సంయుక్తంగా నిర్మించిన ఈ  చిత్రానికి రితీష్ రానా దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు మూడు కోట్లు దగ్గరగా ఖర్చు చేసారు. మరి కొత్త ప్రాజెక్ట్ కోసం సురేష్ బాబు-రానా ఎంత ఖర్చు చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here