అఖిల్ సినిమా నుంచి ఆ స్టార్ ఔట్: ‘ఏజెంట్’లో మరో తెలుగు హీరో.. కొడుకు కోసం నాగార్జున భారీ రిస్క్

0
11

చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా ఓ స్టార్ తప్పుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

బ్యాచ్‌లర్‌గా వస్తున్న అక్కినేని అఖిల్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇది షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా ఇంకా విడుదల కాలేదు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ ‘

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రిలీజ్ కాకముందే అక్కినేని అఖిల్.. సురేందర్ రెడ్డితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ థను అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

రా ఏజెంట్‌గా అఖిల్… పోస్టర్లతో ఫిదా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఏజెంట్’లో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యంగా తయారయ్యాడు. ఇక, ఇటీవలే అతడి బాడీని చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. అలాగే, షూటింగ్‌ను కూడా గ్రాండ్‌గానే మొదలు పెట్టేసింది యూనిట్.

ఏజెంట్‌లో సీనియర్ స్టార్ హీరో ఫైట్

స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ‘ఏజెంట్’ యాక్షన్ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఆరంభంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనను కాదని అదే పరిశ్రమకు చెందిన మమ్ముట్టిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇందులో ఆయన అఖిల్‌కు గురువుగా నటిస్తున్నాడని కొందరు అంటే.. కాదు కాదు విలన్‌గా నటిస్తున్నారని మరికొందరు చెప్పారు.

ఏజెంట్ మూవీ నుంచి ఆ స్టార్ ఔట్

గత సోమవారమే ‘ఏజెంట్’ మూవీ షూటింగ్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులో హీరోపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో మిగిలిన నటీనటుల వివరాలు కూడా త్వరలోనే వెల్లడించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం పరిశీలించిన జాబితా నుంచి మమ్ముట్టి పేరును తొలగించినట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది.

కొడుకు కోసం నాగార్జున భారీ రిస్క్

తాజా సమాచారం ప్రకారం.. ‘ఏజెంట్’ మూవీలో మమ్ముట్టితో చేయించాలనుకున్న పాత్ర కోసం అక్కినేని నాగార్జునను తీసుకు రాబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని అంటున్నారు. కొడుక్కు ఎలాగైనా హిట్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రకు నాగ్ ఒప్పుకున్నారని తెలిసింది. ఇది ఒక రకంగా సాహసమనే చెప్పాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here