‘అఖండ’ ఆల్బం రెడీ.. పెద్దాయన పుట్టిన రోజు స్పెషల్ రిలీజ్

0
30

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ మూవీపై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో బాలయ్య నుండి వచ్చిన సినిమాల్లో దాదాపు ఎక్కువ శాతం నిరాశ పర్చినవే. దాంతో ఆయన సినిమాలంటే పెద్దగా బజ్ కూడా లేకుండా వచ్చేసి వెళ్లి పోయాయి. కాని సింహా మరియు లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో వచ్చిన బాలయ్య బోయపాటి ద్వయం మళ్లీ అఖండ సినిమా తో రాబోతుండటం… దానికి తోడు సినిమా పోస్టర్ లు మరియు వీడియోలు సినిమా పై అంచనాలు పెంచేయడంతో విడుదల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల చివరి వారంలో సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్బంగా అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల మొత్తం తలకిందులు అయ్యింది.

అఖండ సినిమా ను ఎన్టీఆర్ జయంతికి విడుదల చేయలేక పోయినా ఆ రోజున అభిమానుల కోసం సినిమా నుండి ఒక్క పాటను లేదా మొత్తం ఆల్బంను విడుదల చేయాలని భావిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించిన అఖండ ఆల్బం మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అల వైకుంఠపురంలో ఆల్బం తర్వాత థమన్ నుండి ఏ ఆల్బం వచ్చినా కూడా అంచనాలు భారీగా ఉంటున్నాయి. అఖండ ఆల్బంకు కూడా ఖచ్చితంగా థమన్ న్యాయం చేసి ఉంటాడని అంతా ఆశిస్తున్నారు.

బోయపాటి ఈ సినిమాలో బాలయ్యను రెండు విభిన్న షేడ్స్ లో చూపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. రెండు షేడ్స్ లో ఒకటి కాస్త అటు ఇటుగా అఘోరా పాత్ర. ఆ పాత్రలో బాలయ్య లుక్ ఇప్పటికే వచ్చింది. ఆ గెటప్ తో బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరి పోయింది. ఆ టీజర్ కు యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. తక్కువ సమయంలోనే 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గా అది నిలిచింది. అలాంటి సినిమా నుండి ఎన్టీఆర్ జయంతి సందర్బంగా పాటలను విడుదల చేయబోతున్నారనే వార్తలు నందమూరి అభిమానులకు ఆనందం కలుగజేస్తున్నాయి. పాటల విడుదల విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here