‘అఖండ’లో పూర్ణ..ఆ కాసేపే?

0
29

మూమాలుగా  బాలకృష్ణ సినిమాలలో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదనే సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో సింహా లెజెండ్ సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఆయన తాజా చిత్రం అఖండలో హీరోయిన్స్ పరిస్దితి ఏమిటి..వారికి గుర్తింపు తెచ్చే పాత్రలేనా.. అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా మారింది.

అఖండ సినిమాలో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్ పూర్ణ నటిస్తున్నారు. కంచె సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్ కు ఆ సినిమా మినహా నటించిన ఏ సినిమా కూడా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దాంతో  ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆమె ఈ సినిమాలో ఐఏ ఎస్ ఆఫీసర్ గా కనిపించనుంది. అయినా ఆ పాత్ర గ్లామర్ కు లోటు లేకుండా సాగుతుందిట. ఇక మరో హీరోయిన్ గా చేస్తున్న పూర్ణ …బాలయ్యకు భార్య అని తెలుస్తోంది. ఆమె క్యారక్టర్ సెకండాఫ్ లో వస్తుందిట. అలాగే తక్కువ లెంగ్త్ ఉంటుందని ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర అని చెప్తున్నారు. దాదాపు గెస్ట్ రోల్ లాంటిదంటున్నారు. ఇంతకు ముందెప్పుడూ బాలయ్య సరసన పూర్ణ చేసింది లేదు. ఇదే ఆమెకు బాలయ్యతో తొలి సినిమా. పెద్ద సినిమా కాబట్టి క్యారక్టర్ చిన్నదైనా పూర్ణ ఒప్పుకుందిట.

 ఇక నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్యను ఎప్పుడూ చూడని అఘోరా గెటప్ లో చూడబోతున్నాం అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఏ స్దాయిలో ఉన్నాయనేది రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ  విడుదల చేసిన  చిన్న టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టే అర్దమైంది. ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు లెక్కలేస్తున్నారు.  ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.  ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here