అంచనాలు పెంచేస్తున్న ‘బాలయ్య – గోపీచంద్’ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్..!

0
24

నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. బాలయ్య కోసం వాస్తవ సంఘటన ఆధారంగా గోపీచంద్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారని టాక్. అయితే బాలయ్య సినిమాకు సంబంధించి నటీనటులు – సాంకేతిక నిపుణుల ఎంపికలో దర్శకుడు గోపీచంద్ కు నిర్మాతలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారట. ఈ నేపథ్యంలో స్టార్ క్యాస్టింగ్ – టాప్ టెక్నిషియన్స్ ని ఈ సినిమా కోసం తీసుకురావాలని డైరెక్టర్ ఆలోచిస్తున్నారట.

అందుకే కథలో కీలకమైన రెండు ఫీమేల్ లీడ్ రోల్స్ కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తోంది. గోపీచంద్ గత చిత్రాల మాదిరిగానే ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందట. అలానే ‘క్రాక్’ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు – మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి కూడా పని చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా కథ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని వేటపాలెంలోని వందేళ్ల క్రితం నాటి పురాతనమైన లైబ్రరీలో పాత వార్తాపత్రికలతో పరిశోధన చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ షూటింగ్ పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here